Actress Sneha: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి స్నేహ గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.స్నేహ గత కొంతకాలం నుంచి తన భర్త ప్రసన్నకుమార్ కు దూరంగా ఉంటున్నారని తన పిల్లలతో కలిసి ఈమె ఒంటరిగా జీవిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న స్నేహ దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఈ కారణంగానే వీరిద్దరూ విడిగా ఉంటున్నారని త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇలా వీరి గురించి వార్తలు రావడంతో ఎంతోమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
హోమ్లీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్నేహ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఇలా ఎందరికో ఆదర్శంగా ఉన్నటువంటి స్నేహ దంపతులు విడిపోవడం ఏంటి అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో స్నేహ ఈ వార్తలపై స్పందించి ఒక్క పోస్టుతో ఈ వార్తలకు చెక్ పెట్టారు.

Actress Sneha: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన స్నేహ..
ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఖాతా ద్వారా తన భర్త ప్రసన్న కుమార్ తో కలిసి ఎంతో చనువుగా ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీకెండ్ ట్విన్నింగ్ అంటూ క్యాప్షన్ జోడించారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇన్ని రోజులు స్నేహ గురించి వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని ఇందులో ఏ విధమైనటువంటి వాస్తవం లేదని తెలిసిపోయింది. ఇలా ఒక్క పోస్టుతో స్నేహ తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.

































