Actress Sneha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్నేహ అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరుపొందారు. సౌందర్య మరణం తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె అచ్చం తనకట్టు బొట్టు నటనతో సౌందర్యను తలపించారు. అయితే సౌందర్య మాదిరిగా ఇండస్ట్రీలో స్నేహ ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. అతి తక్కువ సమయంలోనే ఫెయిడౌట్ అయ్యారు.

ఇకపోతే హీరోయిన్ గా ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం హీరో వదిన అక్క పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే తమిళ హీరో ప్రసన్నకుమార్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో 2012 మే 11వ తేదీ ఈ దంపతులు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి స్నేహ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఏ కార్యక్రమానికి వెళ్లిన ఇద్దరు జంటగా వెళ్లి చూడముచ్చటగా అనిపించే స్నేహ దంపతుల గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గత కొంతకాలం నుంచి స్నేహ తన భర్త ప్రసన్నకుమార్ కు దూరంగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Actress Sneha: మనస్పర్ధలే కారణమా…
తన భర్తకు దూరంగా పిల్లలతో కలిసి స్నేహ ఉంటుందని తెలియడంతో ఈ దంపతుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగానే విడిగా ఉంటున్నారని, ఇలా విడిగా ఉన్నటువంటి ఈ జంట వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకొని ఒకటవతార లేకపోతే విడాకులు తీసుకొని తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా అని పెద్ద ఎత్తున నేటిజెన్లు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే వీరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే స్నేహ స్పందించాల్సి ఉంది.

































