ఐదవసారి ప్రేమలో పడ్డ వనిత విజయ్‌కుమార్.. ఎప్పుడు అదే పని?

0
682

సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు పెళ్లిళ్లు చేసుకోవడం మనం వినే ఉంటాం. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఒకరి దగ్గర కూడా ఇమడ లేక పోయింది.ఆ నటి మరెవరో కాదు, వనిత విజయ్ కుమార్. తాను ఐదవ సారి ప్రేమలో పడ్డారని స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు.అయితే ఆమె ఎవరితో ప్రేమలో పడ్డారని విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రముఖ సినీ దంపతులైన విజయ్ కుమార్ ,మంజుల పెద్ద కుమార్తె వనిత చంద్రలేఖ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ చిత్రాలలో నటించడమే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. 2020 సంవత్సరం లో వనిత నటుడు ఆకాశం వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆకాష్ తో విడాకులు తీసుకున్న వనిత ప్రముఖ వ్యాపారవేత్త అయిన జయ్ రాజన్‌ను అదే సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకున్నారు.

అయితే వీరిద్దరి బంధం కూడా ఎక్కువ కాలం నిలువ లేక పోయింది 2012 సంవత్సరంలో వనిత ఇతనితో కూడా విడాకులు తీసుకున్నారు.విడాకులు తీసుకోవడమే కాకుండా మరో నాలుగేళ్ల పాటు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్ తో కలిసి రిలేషన్ లో ఉన్నారు. 2017 రాబర్ట్ మాస్టర్ తో విడిపోయింది. అయితే అంతటితో ఆగకుండా వనిత తన ప్రేమ ప్రయాణాన్ని వేరొక వ్యక్తితో కొనసాగించింది. తాజాగా 2020 జూన్ 27న సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని ముచ్చటగా మూడవ పెళ్లి చేసుకుంది. అయితే ఈ మూడో పెళ్లి సమయం లో పీటర్ పాల్ భార్య ఎలిజిబెత్ తనకు విడాకులు ఇవ్వకుండా వనితను ఎలా పెళ్లి చేసుకుంటావని పెద్ద రచ్చ చేసింది.

వనిత మూడవ వివాహం కూడా కొద్ది రోజులు కూడా గడవకుండానే ముగిసిపోయింది. పీటర్ కోసం నేను అన్నీ వదులుకొని వచ్చినప్పటికీ తను మాత్రం నా కన్నా మందు అంటేనే ఇష్టమని చెప్పారు. అయితే ఇప్పటికీ తను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానని, ఐదవ సారి అతను ప్రేమలో పడ్డానని ఇంస్టాగ్రామ్ ద్వార పోస్ట్ చేస్తూ ఇప్పుడు మీరు హ్యాపీనే కదా అంటూ నటి ఉమా రియాజ్ ఖాన్‌ని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు ఐదవసారి వనిత ఎవరితో ప్రేమలో పడిందో తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.