Actress Vennira Aadai Nirmala: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో తెలుగు తమిళ భాషలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వెన్నిరాడై నిర్మల ఒకరు. వెన్నిలాడే చిత్రంతో వెండితెరపైకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. ఇక ఎంతోమంది సీనియర్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఈ విధంగా హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 400కు పైగా సినిమాలలో నటించిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఇకపోతే తన సినీ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సినిమా పేరు హీరో పేరు చెప్పకుండా ఓ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకరోజు ఓ సినిమా షూటింగ్లో పాల్గొని తాను ఇంటికి వచ్చానని తెలిపారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ సినిమాలో నాతో కలిసి నటిస్తున్నటువంటి హీరో తప్ప తాగి ఇంటికి వచ్చి తన ఇంటి తలుపులు తట్టారని తెలిపారు.

Actress Vennira Aadai Nirmala:తర్వాతి రోజు షూటింగ్ వెళ్లలేదు…
ఈ విధంగా ఆ హీరో ఇంటి తలుపులు తట్టడంతో తాను తలుపులు తీయలేదని ఆయన మాత్రం వెళ్లకుండా అక్కడే నిల్చుని నేను మిమ్మల్ని ఏమీ చేయను దయచేసి తలుపు తెరవండి కేవలం మీ పక్కన నిద్రపోయి వెళ్లిపోతాను అన్నాడు.ఆ తర్వాతి రోజు నుంచి నేను షూటింగ్ కి కూడా వెళ్లలేదని ఈమె తెలిపారు. దర్శక నిర్మాతలు తనని ఒప్పించే ప్రయత్నం చేసిన నేను ఈ సినిమాలో నటించిన ఖరాకండిగా చెప్పేశాను. ఇలాంటి వాటిని నేను అసలు సహించని ఈ సందర్భంగా నిర్మలా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































