Actress Viji Chandrashekhar : తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అన్ని సౌత్ భాషల్లో నటిస్తూ గుర్తింపు అందుకున్న నటి సరిత గారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను మరో పక్క నటిగాను గుర్తింపు తెచ్చుకున్న సరిత గారి చెల్లి విజి చంద్రశేఖర్ కూడా నటి. అయితే తెలుగులో ‘అఖండ’ సినిమా మాత్రమే చేసారు. అఖండ సినిమాలో బాలకృష్ణ తల్లిగా నటించిన ఆమె ఆ సినిమా తరువాత తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే పలు తమిళ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చున్న ఆమె తమిళ సినిమాల్లో కొన్నిటిలో నటించారు. ఆమె నటించిన సీరియల్స్ లో ఆరోహం అనే సీరియల్ కి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మేము తెలుగువాళ్ళమే…
విజి చంద్రశేఖర్ మొదటి నుండి తమిళ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఆమె తమిళనాడుకు చెందిన ఆమె అని అందరూ అనుకున్నా అఖండ సినిమాలో చేసాక గానీ ఇక్కడి ప్రేక్షకులకు ఆమె ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు అని తెలియదు. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన బ్యాక్ గ్రౌండ్ చెబుతూ తల్లిదండ్రులు ఇద్దరూ విజయవాడ, గుంటూరు కి చెందిన వారు కాగా తండ్రి గుంటూరు జిల్లా వ్యక్తి అని చెప్పారు.

తాత కొడాలి అంజయ్య గారికి అక్కడ మంచి పేరు ఉందని, రైస్ మిల్లులు అవి ఉండేవని, వ్యవసాయిక కుటుంబం కాగా నాన్న వ్యాపార రీత్యా చెన్నై రావడం వల్ల ఇక్కడే స్థిరపడ్డామంటూ చెప్పారు. కొడాలి ఇంటి పేరు ఉండటం వల్ల వైసీపీ నేత కొడాలి నాని బంధువు అవుతారా అనే ప్రశ్నకు అయ్యుండొచ్చు అక్కడ రెండు జిల్లాల్లో చాలా మంది ఉన్నారు అంటూ చెప్పారు. ఇక అత్తింటి వారికీ టీ ఎస్టేట్స్ ఉన్నాయని, వేయి ఎకరాల భూములు ఉన్నాయని, అయితే ఏ నాడు బ్యాక్ గ్రౌండ్ చెప్పుకోవడం నాకు మా ఆయనకు నచ్చదని చెప్పారు విజి. ఎపుడూ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తామని చెప్పారు. బయట కనిపించడం కూడా చాలా తక్కువ అంటూ చెప్పారు.































