ఒకే హీరోకు భార్యగా, తల్లిగా యాక్ట్ చేసిన నటీమణులు ఎవరో తెలుసా?

0
1355

సినిమా పరిశ్రమలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకే హీరో సరసన హీరోయిన్ గా నటించిన పలువురు కొంత కాలం తర్వాత అదే హీరోకు తల్లిగా నటించిన సందర్భాలున్నాయి. నాటి భానుమతి నుంచి నేటి అనుష్క శెట్టి వరకు ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి.

ఎన్టీఆర్, క్రిష్ణ, చిరంజీవి తో పాటు నేటి తరానికి చెందిన ప్రభాస్ వరకు ఇలాంటి పాత్రలు ఎదురయ్యాయి. ఒకప్పటి వాళ్ల హీరోయిన్లు అనంతరం అమ్మగా నటించారు. ఇంతకీ అలా నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

*భానుమతి
భానుమతి అనగానే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గానే గుర్తుకు వస్తుంది. అలాంటి తను 1992లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించింది.

*శారద
తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులు అందుకున్న శారద.. కృష్ణతో కలిసి రాధమ్మ పెళ్లి, ఆడంబరాలు, అనుబంధాలు, ఇంద్రధనస్సు సినిమాలు చేసింది. అనంతరం అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్, అగ్నిపర్వతం లాంటి సినిమాల్లో కృష్ణక తల్లిగా చేసింది.

*అంజలి దేవి
నాగేశ్వరరావుతో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అనంతరం పలు సినిమాల్లో ఏఎన్ఆర్ తల్లిగా నటించింది.

*జయసుధ
చిరంజీవితో పలు సినిమల్లో హీరోయిన్ గా చేసింది జయసుధ. కొంతకాలం తర్వాత జయసుధ రిక్షావోడు సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించింది.

*సుజాత
దివంగత నటీమణి సుజాత కూడా చిరంజీవితో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి తల్లిగా చేసింది.

*భానుప్రియ
జయం మనదేరా సినిమాలో వెంకటేష్ తల్లిగా నటించిన ఆమె.. అదే సినిమాలో సీనియర్ వెంకటేష్ కు భార్యగా యాక్ట్ చేసింది. అంతకు ముందు శ్రీనివాస కల్యాణం, స్వర్ణకమలం వంటి పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

*అనుష్క శెట్టి
బాహుబలి సినిమాలో సీనియర్ ప్రభాస్ కు భార్యగా.. జూనియర్ ప్రభాస్ కు భార్యగా నటించింది.