Adavi Shesh & Supriya : సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ లో ఏవో కొన్ని నిజమైనవి ఉంటాయి. చాలా వరకు ఫేక్ న్యూస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సెలబ్రిటీల గురించి వచ్చే న్యూస్ అంటే వాళ్ల రిలేషన్స్ మీదనే. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో అడవి శేష్ ఒకరు. ఈ మధ్యనే అడవి శేష్ ‘మేజర్’ సినిమాతో మంచి హిట్ కూడా అందుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అడవి శేష్ కెరీర్ లో సక్సెస్ అవుతున్నాడు. అయితే ఈ మధ్య అడవి శేష్ రిలేషన్ లో ఉన్నాడని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అది కూడా ఎవరినో కాదు సుమంత్ అక్క, నాగార్జున మేనకోడలు సుప్రియతో. మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా ఈ మధ్య తరచూ వాళ్ళు మీడియా కంట పడటంతో ఏదో మ్యాటర్ ఉంది అని అందరికీ అనిపిస్తోంది.

రామ్ చరణ్ బర్త్ డే కి ఒకే కారులో…
ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా చిరంజీవి గారు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలకు ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ప్రముఖులను పిలిచారు చిరు. అలా అడవిశేష్, సుప్రియ కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. అయితే వీళ్లిద్దరూ ఆ వేడుకకు ఒకే కారులో రావడంతో మరోసారి మీడియకు స్టఫ్ దొరికింది.

ఇప్పటికే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు షికార్లు కొడుతున్న తరుణంలో వీళ్లిద్దరూ మరోసారి కలిసి కనిపించడంతో త్వరలో శుభవార్త చెబుతారని అనిపిస్తుంది. గతంలో అక్కినేని ఫ్యామిలీ నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో కూడా అడివి శేష్ వెళ్లడం సుప్రియ పక్కన కూర్చోవడంతో అనుమానాలు అందరికీ వచ్చినా నిజం కాదేమో అని యెక్కడో అనిపించినా ఈసారి ఇద్దరూ కలిసి కారులో రావడంతో నిజమే, వీళ్ళ మధ్య ఏదో ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.