Hyper Aadi: హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.

ఇదిలా ఉండగా హైపర్ ఆది మెగా ఫ్యామిలీకి భక్తుడు అనే సంగతి మనకు తెలిసిందే. మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా అంటే ఈయన అసలు సహించరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో హైపర్ ఆది చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన గురించి ఎవరైనా విమర్శిస్తే వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా ఈయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించి పవన్ విజయానికి దోహదం చేశారు. ఇక అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసిపి అభ్యర్థికి మద్దతు తెలపడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హైపర్ ఆది ఇటీవల మీడియా సమావేశంలో భాగంగా అల్లు అర్జున్ గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ గురించి విమర్శలు చేస్తున్నారు అయితే ఈయన గురించి విమర్శలు చేయడం సరైనది కాదని ఇకపై విమర్శలు ఆపమని తెలిపారు.
మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే..
అల్లు అర్జున్ గురించి విమర్శలు చేయడం మంచిది కాదు అల్లు అర్జున్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి వీరంతా కూడా మెగా ఫ్యామిలీ నేనని మెగా ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటేనని హైపర్ ఆది వెల్లడించారు. తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందపడతా బాధ వస్తే మాత్రం దగ్గరికి వస్తానని తెలిపారు.. ఇకపోతే తనకు జనసేన నుంచి ఎమ్మెల్సీ పదవి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజం లేదని నేను ఎలాంటి పదవులు ఆశించలేదని క్లారిటీ ఇచ్చారు.
































