పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమాతో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం కూడా విధితమే.

ఆ తర్వాత తీసిన ప్రతీ సినిమాను అతడు పాన్ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు కన్ ఫామ్ చేసేసింది.
అంతకు ముందు కచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేమని చెప్పిన యూనిట్ సభ్యులు ప్రస్తుతం ఆ డేట్ కన్ ఫామ్ చేసేశారు. ప్రస్తుతం రెబల్ స్టార్ సలార్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.































