Adivi Sesh: తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి నాచురల్ స్టార్ నాని అడివి శేష్ గురించి అందరికీ సుపరిచితమే.అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన నాని అనంతరం హీరోగా మారడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇక అడివి శేష్ సైతం పలు సినిమాలలో నటిస్తూ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే తాజాగా అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నటువంటి చిత్రం హిట్ 2. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఉరికే ఉరికే అనే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ పాటకు హీరో హీరోయిన్లు ఇద్దరు హైదరాబాదులో నాని ఆఫీసులో ఎంతో రొమాంటిక్ డాన్స్ చేస్తూ ఈ డాన్స్ వీడియోని అడివి శేష్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలా డాన్స్ చేయడానికి చాలా సిగ్గుగా ఉంది ఆయన మీ కోసం ఏమైనా చేస్తా అంటూ ఈయన క్యాప్షన్ జోడించారు.

Adivi Sesh: మీ కోసం ఏదైనా చేస్తా…
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే నాచురల్ స్టార్ నాని స్పందిస్తూ… నా ఆఫీసును ఇలా కూడా వాడొచ్చా అంటూ ఈయన ఫన్నీ కామెంట్ చేశారు. ఇది చూసినటువంటి ఎంతోమంది నేటిజెన్లు అయ్యో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ అడివి శేష్ నానికి అడ్డంగా బుక్ అయిపోయారే అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ సినిమా 2020వ సంవత్సరంలో విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకున్న సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.




























