Adivi Sesh:టాలీవుడ్ యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అడివి శేష్ వరస హిట్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. మేజర్ వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న అనంతరం హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా మంచి హిట్ కావడంతో శేష్ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈయన నటించిన హిట్ 2సినిమా మంచి విజయం కావడంతో శేష్ ట్విట్టర్ వేదికగా సరదాగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులతో మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని మహేష్ బాబు గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా అభిమాని మాట్లాడుతూ హిట్ యూనివర్స్ లోకి మహేష్ బాబును తీసుకురండి అన్న..ఎప్పటినుంచో మీరు ఎంచుకొనే త్రిల్లింగ్ సస్పెన్స్ సినిమాలో మహేష్ బాబును కూడా చూడాలని కోరికగా ఉంది. తప్పకుండా మహేష్ బాబుతో చేయండి అంటూ అడవి శేష్ ను రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రశ్నకు అడివి శేష్ సమాధానం చెబుతూ ఎమోషనల్ అయ్యారు..

Adivi Sesh: సోదరుడిగా నీ వెంటే ఉంటా అన్నారు…
నేడు ఉదయం మహేష్ బాబు గారు తనకు ఫోన్ చేసి చాలా సమయం వరకు మాట్లాడారని తెలిపారు. నా విషయంలో మహేష్ బాబు చాలా గర్వంగా ఉందని చెప్పడంతో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఒక సోదరుడిగా ఎప్పుడూ తన వెంటే ఉండి తనని ప్రోత్సహిస్తానని తెలిపారు. ఎప్పుడేప్పుడు ఆయనకు హిట్ 2 సినిమా చూపించాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాననీ శేషు చెప్పకోచ్చారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































