పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గారాలపట్టి ఆధ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆద్య, అకీరానందన్ తన తల్లి రేణుదేశాయ్ దగ్గరే ఉన్నారు. అయితే రేణుదేశాయ్ కుటుంబంతో హీరో అడివి శేష్ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. పంజా సినిమా షూటింగ్ సమయం నుంచి అడివి శేష్ అకీరానందన్ మధ్య బంధం బలపడిందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే అడవి శేష్ బాస్కెట్ బాల్ ఆడటం కోసం తరుచు వస్తారని రేణు దేశాయ్ ఇది వరకు మనకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో అకీరా అడివి శేష్ కోసం ప్రత్యేకంగా మాస్కులు తయారు చేసి పంపించారు. అంతే కాకుండా మనకు సోషల్ మీడియాలో అకీరా, అడివి శేష్ దిగిన ఫోటోలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. అంతగా వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉందని చెప్పవచ్చు.
ఈ విధంగా తరచూ అకీరా అడివి శేష్ కలవడంతో అడివి శేష్ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారేమో అనే వార్తలు బలంగా వినిపించాయి. అదేవిధంగా అడివి శేష్ కూడా రేణుదేశాయ్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల వీరి గురించి ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే అడివి శేష్ కు మీకున్న రిలేషన్ ఏంటని ఎన్నోసార్లు రేణు దేశాయ్ అని ప్రశ్నించారు.
తాజాగా అడివి శేష్ ,రేణు దేశాయ్ ల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ షేర్ చేశారు. ఈ క్రమంలోనే అడవి శేష్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య చేసే రుచికరమైన ఐస్ క్రీమ్‌ను తినేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాను చెబుతూ రేణుదేశాయ్ కి ట్యాగ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఆద్య… ఆ దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి అంటూ ఆద్యను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ క్రమంలోనే రేణుదేశాయ్ స్పందిస్తూ నువ్వు ఆమెకు ఎంతో ప్రత్యేకమైన అన్నయ్యవి కదా… ఇలా బుజ్జి గించాల్సిన పని లేదు అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.































