Actor Kadambari Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలం నుంచి ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లభించలేదు.దాసరి నారాయణరావు మరణం తర్వాత ఇండస్ట్రీ పెద్దదిక్కును కోల్పోయింది. దాసరి ఉన్నప్పుడు ఇండస్ట్రీ సమస్యలను ఎంతో చక్కగా పరిష్కరిస్తూ ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించే వారు.ఇక ఆయన మరణం తర్వాత ఇండస్ట్రీ బాధ్యతలను ఎవరు తీసుకోలేదు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే ప్రశ్న మొదలైన ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అంటూ పలువురు భావిస్తున్నారు. చిరంజీవి అవునన్నా…కాదన్న ఆయననే ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా నటుడు కాదంబరి కిరణ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనగా ఆయనకు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం గురించి ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు కాదంబరి సమాధానం చెబుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలను తీసుకోవడానికి వెనకడుగు వేశారు.ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ఆదుకోవడానికి ముందుంటాను కానీ ఇలాంటి బాధ్యతలు నాకొద్దు అంటూ చిరంజీవి చెప్పారు. ఇక ఈ విషయం గురించి కాదంబరి మాట్లాడుతూ చిరంజీవి గారు అలా మాట్లాడటం పూర్తిగా తప్పు అని వెల్లడించారు. నాయకత్వం అనేది ఇచ్చేది కాదు.. నాయకత్వం ఆయన తెచ్చుకున్నది కాదు. తమకు కష్టం వస్తే తన దగ్గరకు వెళితే ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఆ సమస్యను వారి ముందు చెప్పుకోవడమే పెద్దమనిషితనం.
ఆయనే ఇండస్ట్రీకి అండ
ప్రస్తుతం ఈ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా తన వద్దకు వెళితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి తప్ప ఇండస్ట్రీ సమస్యలను భుజాలపై వేసుకొని మోసేవారు మరొకరు లేరు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తర్వాత అలాంటి రేంజ్ కేవలం మెగాస్టార్ కి మాత్రమే ఉంది. ఎప్పటికైనా ఆయనే ఇండస్ట్రీ పెద్ద.. ఆయనే ఇండస్ట్రీకి అండ అంటూ కాదంబరి కిరణ్ మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
































