టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొంది బాలీవుడ్ లో సెటిల్ అయినా హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సత్యం సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా జెనీలియా తోసినిమా తోనే అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంటనే పెద్ద సినిమాలు రావడంతో జెనీలియా కి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ వచ్చింది. మూడో సినిమానే రాజమౌళి సై సినిమా లో చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉంది.

ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకులేదు.. తన కెరీర్ లో బొమ్మరిల్లు సినిమా మైలురాయిగా నిలిచిపోతుంది. ఆ సినిమాలోని పాత్ర పేరుతో నే ఆమెను ఇంకా టాలీవుడ్ జనాలు పిలుస్తున్నారంటే ఆ సినిమా ఆమెకు ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో చెప్పొచ్చు. ఇక టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో ఆమెకు బాలీవుడ్, కోలీవుడ్ ఛాన్స్ లు కూడా పెరిగిపోయాయి.
అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో ఒక సినిమా ద్వారా పరిచయమైన రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే వీదిద్దరి మధ్య వయస్సులో చాలా గ్యాప్ ఉంది. జెనీలియా కంటే రితేష్ దేశ్ ముఖ్ సుమారు 9 ఏళ్ళు పెద్దవాడు. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండగా విషయం రితేష్ కుటుంబ సబ్యులకు తెలియడంతో మొదట్లో వీరి పెళ్ళికి వారు ఒప్పుకోలేదు. నిజానికి జెనీలియా క్రిస్టియన్ అమ్మాయి కావడమే దీనికి కారణం. అయితే చాలా రోజులు కస్టపడి ఇంట్లో ఒప్పించాడు రితేష్. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు.
































