Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ తర్వాత నేషనల్ వైడ్ మారుమోగుతున్న పేర్లలో అల్లుఅర్జున్ పేరు ఒకటి. పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు.

వెండి తెరపై హీరోగా ఎంతోమందిని ఆకట్టుకున్న అల్లుఅర్జున్ తాజాగా సరికొత్త అవతారమెత్తి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. హీరోగా ప్రేక్షకులను మెప్పించిన ఐకాన్ స్టార్ ఇకపై హోస్ట్ గా మారనునట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి ఆదరణ దక్కించుకున్నారు. వీరి బాటలోనే అల్లు అర్జున్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా ఓటీటీ ద్వారా టాక్ షోలో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే సరికొత్త రియాలిటీ షో ద్వారా హోస్ట్ గా మారనున్నట్లు సమాచారం.
అభిమానులకు పండగే..
ఆహా ఓటీటీ అల్లుఅర్జున్ కుటుంబానికి చెందినది కావడంతో అల్లుఅర్జున్ కూడా రియాలిటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. ఇప్పటికే యంగ్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ కూడా సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
































