Aishwarya: యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య వివాహపు వేడుకలు ప్రారంభం అయ్యాయి. జూన్ 10వ తేదీ వీరి వివాహం చెన్నైలోనే హనుమాన్ ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసినదే .ఇక పెళ్లికి ఒక రోజు సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే ఐశ్వర్య హల్దీ మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె ప్రముఖ కోలీవుడ్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఏడడుగులు వేయబోతున్నారు. నిజానికి తంబి రామయ్య ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది..
ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో వీరి ప్రేమ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయడం పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా వీరి నిశ్చితార్థపు వేడుకలు జరిగాయి. ఇక జూన్ 10వ తేదీ పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి.
ప్రేమ వివాహం..
తాజాగా హల్దీ మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా అర్జున్ తన కుమార్తెను ఎంతో ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీరి వివాహం అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలోనే జరగటం విశేషం ఇక ఈ వివాహానికి కోలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.



























