దసరా పండుగ నేపథ్యంలో థియేటర్లలో సందడి చేసేందుకు అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే అఖిల్ సినిమా విడుదల సందర్బంలో ఓ వ్యక్తి ఉత్సాహంతో ఊగిపోతూ.. ‘అయ్యగారే కరెక్టు.. అఖిల్ అయ్యగారే రావాలి’ అంటూ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఫేమస్ అయిపోయాడు.

అఖిల్ సినిమా రిలీజ్ సందర్భంగా అతడు థియేటర్ ఎదుట ఫుల్ హంగామా చేసేశాడు. అక్కినేని ఫ్యామిలీకి అతడు మొదటి నుంచి కూడా పెద్ద ఫ్యాన్. నాగార్జున, నాగచైతన్య సినిమాలు రిలీజ్ అయిన సందర్భంలో కూడా అతడు థియేటర్ వద్ద ఇలానే హంగామా చేస్తుంటాడు.
ఇలా వీరాభిమానంతో అతడు సోషల్ మీడియాలో పెద్ద పాపులారిటీ తెచ్చుకున్నాడు. అతడి వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ.. అఖిల్ వద్దకు చేరుకుంది. దీనిపై అఖిల్ స్పందించాడు. అతని అభిమానం చూసి తాను ఆశ్చర్యపోయాను అని.. అతడిని కశ్చితంగా కలుస్తాను అంటూ అతడు ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్టు చేశాడు.
I’m happy that my fan has become more popular. I would love to meet him soon – Akhil Akkineni on Instagram live about #Ayyagaru fan.#MostEligibileBachelor pic.twitter.com/CBBlwgzrRt
— Nandamuri Abhimani (@ntr_chalapathi) October 18, 2021
అతడు నాకంటే కూడా పెద్ద పాపులర్ అయ్యాడు అంటూ కితాబిచ్చాడు. ఇదంతా ఇలా ఉండగా.. గూగుల్ లో ప్రస్తుతం అయ్యగారు అని టైప్ చేస్తే అతడి ఫొటోనే వస్తుంది. అయ్యగారు నంబర్ వన్ అంటూ.. ఈ వ్యాఖ్య ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.






























