అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 15 వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో అఖిల్ పాల్గొంటున్నారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అఖిల్ నటిస్తున్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మాట్లాడటమే కాకుండా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలిపారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు క్రీడల బయోపిక్ సినిమాలంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలిపారు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో రణవీర్ సింగ్ దీపికా పదుకొనే నటించిన 83 సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, ఈ సినిమా కపిల్ దేవ్ జీవిత ఆధారంగా తెరకెక్కి ఉండడంతో ఈ సినిమాపై ఎంతో ఆతృత ఏర్పడిందని తెలిపారు. ఈక్రమంలోనే తనకి కూడా ఏదైనా క్రీడల బయోపిక్ చిత్రాలలో నటించాలని ఉందన్న విషయాన్ని బయటపెట్టారు.
ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ తనకు ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాలో నటించాలని ఉందని తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.విరాట్ కోహ్లీ జీవితం క్రికెట్ పై ఫ్యాషన్ తో, చాలా అగ్రెసివ్ గా ఉంటుందని ఈ సందర్భంగా అఖిల్ తెలిపారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై అటు అఖిల్,ఇటూ బొమ్మరిల్లు భాస్కర్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారని చెప్పవచ్చు.































