Akkineni Compound: ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు ఉండేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు మరణం తర్వాత అక్కినేని అనే బ్రాండ్ కు పూర్తిగా వ్యాల్యూ తగ్గిందని చెప్పాలి. అందుకు గల కారణం అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల సినిమాలు ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడం ఒక కారణం అయితే అక్కినేని హీరోలు వారి వ్యక్తిగత జీవితంలోను అలాగే వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యారని.

ఇప్పటికే అక్కినేని వారసుడిగా నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇచ్చే రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ఆయన బాటలోనే ఆయన తనయలు నాగచైతన్య సైతం సమంతకు విడాకులు ఇవ్వడంతో వీరి విడాకుల విషయం ఏకంగా నేషనల్ ఛానల్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలా అక్కినేని కుటుంబం పలు కారణాలవల్ల తరచు వార్తలు నిలుస్తూ ఉన్నారు.

ఈ విధంగా ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే ఈ కుటుంబం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగా ఒక ఇంట్లో నివసిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే.ఇక విడాకుల అనంతరం నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ఈయన పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆ నటి కేవలం తన మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ సమాధానం చెప్పారు.
పడిపోయిన అక్కినేని బ్రాండ్ వాల్యూ…
ఇకపోతే తాజాగా అర్ధరాత్రి నాగచైతన్య కాంపౌండ్ లోకి ఒక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందని వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇలా ఒంటరిగా ఉన్న ఓ హీరో ఇంటికి అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ ఎందుకు వెళ్ళింది అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సమంత అభిమానులు రెచ్చిపోతూ మా హీరోయిన్ ను నిందించడం ఆపేసి అర్ధరాత్రి సమయంలో మీ హీరో దగ్గరకు ఆ హీరోయిన్ రావడానికి గల కారణం ఏంటో చెప్పండి అంటూ సమంత ఫ్యాన్స్ చైతన్య అభిమానులను రెచ్చగొడుతున్నారు.మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

































