Akkeneni Family: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫ్యామిలీగా గుర్తింపు సంపాదించుకున్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఏదో ఒక వార్త ద్వారా ఈ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తున్నారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య రెండవ పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున చైతన్యకు రెండవ పెళ్లి చేయాలని భావిస్తున్నారట ఈ క్రమంలోనే నాగార్జున చైతన్య రెండవ పెళ్లి విషయం గురించి మాట్లాడటం కోసమే సమంత తండ్రిని కలిసి అన్ని విషయాలలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా త్వరలోనే నాగచైతన్య రెండవ పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా సుశాంత్ తన సోషల్ మీడియా ద్వారా అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోని షేర్ చేశారు.అయితే నాగచైతన్య పెళ్లి ప్రకటన చేయడానికి ముందు అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ ఇలా ఒకేచోట కలిశారని అందుకే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెలితిగా ఉన్న ఫోటో..
ఈ విధంగా అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఈ ఫోటోలో ఉన్నప్పటికీ సమంత లేకపోవడంతో సమంత అభిమానులు మిస్ యూ సామ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత అక్కినేని కుటుంబానికి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిన సమంతా ప్రస్తుతం ఈ ఫోటోలో లేకపోవడంతో ఏదో వెలితిగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్ కూడా ఈ ఫోటోలో లేకపోవడం గమనార్హం.అయితే అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లడం వల్ల ఈ ఫోటోలో మిస్ అయ్యారని తెలుస్తోంది.






























