Akkineni Nageswararao : అక్కినేని నాగేశ్వరరావు.. 1941 లో వచ్చిన ‘దర్మపత్ని’ సినిమాతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి ‘మనం’ సినిమా వరకు దాదాపు 256 సినిమాలలో నటించాడు. నటసామ్రాట్ గా అభిమానులలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మవిభూషణ్ అందుకున్న తొలి తెలుగు నటుడు. 2014 జనవరి 22న మరణించారు. అయితే సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి కావడంతో ఆ రోజు 40 ఏళ్ళ క్రితం ఆయన నటించిన సినిమా విడుదల చేయబోతున్నారు.

అనుకోని కారణాల వలన అప్పుడు విడుదల కాని సినిమా…
అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఒక సినిమా 40 ఏళ్ళ తర్వాత ఇపుడు విడుదల కానుండడం విశేషమని చెప్పాలి. అయితే సినిమా పేరు ‘ప్రతిబింబాలు’ , ఇందులో నాగేశ్వరావు గారి సరసన జయసుధ, తులసి హీరోయిన్లుగా 1982 విష్ణుప్రియ బ్యానర్ పై జాగార్లమూడి రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు కె. రాఘవేంద్ర రావు గారి తండ్రి అయిన కె. యస్ ప్రకాష్ రావు గారు దర్శకత్వం మొదలుపెట్టగా ఆయన మరణించగా దానిని సింగీతం శ్రీనివాసరావు గారు పూర్తిచేసాడు.

అయితే అప్పట్లో రీల్స్‌లో తీసిన ఈ సినిమా ప్రింట్‌ను డిజిటల్ పార్మేట్ లోకి కన్వర్ట్ చేసి ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. అప్పట్లో విష్ణుప్రియ కంబైన్స్ బ్యానర్ పై కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలతో ‘వియ్యాలవారి కయ్యాలు, ఒక దీపం వెలిగింది, శ్రీవినాయక విజయం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, కోరుకొన్న మొగుడు’ వంటి హిట్ చిత్రాలు నిర్మించింది. అయితే ఏఎన్ఆర్ తో కూడా తన బ్యానర్ లో సినిమా తీయాలానే పట్టుదలతో ప్రతిబింబాలు సినిమా తీయడం జరిగింది. అప్పుడు కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోని ప్రతిబింబాలు సినిమా ఇపుడు విడుదల అవుతుండటంతో తన సంతోషాన్ని వ్యక్తపరిచారు నిర్మాత.


































