మనలో చాలామంది సినిమా స్టార్లను చూసి వాళ్లకు ఏం కష్టాలు ఉండవని… కోట్లకు కోట్ల రూపాయలు వాళ్లకు రెమ్యూనరేషన్ రూపంలో దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. సినిమా స్టార్లు రాజ భోగాలు అనుభవిస్తూ ఉంటారని…. చిన్నప్పటి నుండి కష్టాలు, కన్నీళ్లు తెలియని జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. అయితే అందరి జీవితాలు అలా ఉండవు. కొందరి జీవితాలు కష్టాలు, కన్నీళ్లతో నిండి ఉంటాయి.

బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ సినిమాల్లోకి రాకముందు వెయిటర్‌గా పని చేశారు. ఆయనను అభిమానించే అభిమానులకు ఈ విషయం బాగా తెలుసు. అలాంటి అక్షయ్ కుమార్ ప్రస్తుతం కోట్ల రూపాయలు పారితోషికం రూపంలో అందుకుని ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం ఎంతో సహాయం చేశాడు. తాజగా అక్షయ్ తన పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు.

అక్షయ్ సినిమా ఇండస్టీలోకి అడుగు పెట్టక ముందు చిన్నచిన్న ఉద్యోగాలు చేసి జీవనం సాగించేవాడు. తాజాగా ఇన్‌ టు ది వైల్డ్‌ అనే షో కోసం ఎన్నో సాహసాలు చేశాడు. బేర్‌ గ్రిల్స్‌తో కలిసి అక్షయ్ కుమార్ చేసిన సాహసాలు డిస్కవరీ ప్లస్‌ యాప్‌లో రాబోయే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది. బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌ అనే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రాంతంలో ఈ షోకు సంబంచిన షూటింగ్ జరిగింది.

ఈ షో గురించి మాట్లాడుతూ అక్షయ్ వెయిటర్ గా పని చేసే సమయంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. తాను థాయిలాండ్ లో వెయిటర్ గా పని చేసే వాడినని… వెయిటర్ గా పని చేసే సమయంలో తనకు ఎక్కువ పని ఉండేది కాదని… ఎంతో స్వేచ్ఛగా జీవించే వాడినని… అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని… వెయిటర్ గా పని చేసే సమయంలో ఒక మహిళ కిస్ పెట్టిందని అక్షయ్ చెపుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here