YS Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన పోలవరం గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు తమ హయాంలోని 72% పోలవరం పనులు పూర్తి అయ్యాయని కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులన్ని దారి మళ్ళించారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఈయన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించారు.

గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం మల్లె పోలవరం పూర్తి కాలేకపోయిందని చెప్పారు నాణ్యత లేకుండా డయాఫ్రమ్ నిర్మించడంతో డ్యాం పూర్తిగా డామేజ్ ఆయన నేపథ్యంలోనే పోలవరం పూర్తి కాలేకపోయిందని తెలియజేస్తున్నారు. ఇక ఇటీవల పోలవరం పై చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా పోలవరం విషయంలో నువ్వా నేనా అంటూ రెండు పార్టీలు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బిజెపి నేత అలపాటి లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..పోలవరం విషయంలో డ్యామేజ్ ని కప్పి పుచ్ఛి పనులు కొనసాగిస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ప్లాన్ మార్చమని చెప్పిన జగన్ లాంటి సీఎం ఎక్కడా ఉండరని లక్ష్మీనారాయణ తెలిపారు.
ప్రజలను మోసం చేయలేను..
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన నిర్మాణ పనులలో డ్యామేజ్ కారణంగా వాటిని కప్పి పుచ్చి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే అది ప్రజలకు పెద్ద ఎత్తున ప్రమాదకరమని ఈ విషయంలో ప్రజలను మోసం చేయలేనని చెప్పిన వ్యక్తి జగన్ అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.





























