Gachibowli Accident: హైదరాబాద్ గచ్చిబౌలిలో కారు బీభత్సం గురించి మనకు తెలిసిందే.అతి వేగం కారణంగా డివైడర్ ను ఢీకొని గాయత్రి అనే జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం పై ఆరా తీసిన పోలీసులు మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఇక ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల… మేరకు కూకట్‌పల్లి HMT హిల్స్ ఆదిత్య హోమ్స్‌కాలనీకి చెందిన రోహిత్ ఎంబీఏ పూర్తి చేసి రైస్ గోడౌన్ బిజినెస్ చేస్తూ పెద్దఎత్తున డబ్బు సంపాదించాడు. ఈ క్రమంలోనే ప్రతివారం స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ పెద్ద ఎత్తున పార్టీలు జరుపుకునే రోహిత్ హోలీ పండుగ సందర్భంగా తన స్నేహితురాలు గాయత్రితో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న గాయత్రి, రోహిత్ కలిసి హోలీ పండుగముందు రోజే ఫుల్లుగా మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. ఇక మిగిలిన మద్యాన్ని కొబ్బరిబొండాలలో నింపుకొని ప్రిజం పబ్‌లో హోలి పండుగను జరుపుకున్నారు.
విషమంగా రోహిత్ పరిస్థితి…
ఈ విధంగా పబ్ లో పీకల్లోతు మద్యం తాగారు. హోలీ పండుగ సందర్భంగా ఫుల్లుగా మద్యం తాగి మద్యం మత్తులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే కారు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ దగ్గర డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే గార్డెన్‌లో పనిచేసే మహేశ్వరి అనే మహిళ చనిపోయింది. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గాయత్రీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. అలాగే రోహిత్ పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలియజేశారు.



























