Alekhya Harika: దేత్తడి హారిక పరిచయం అవసరం లేని పేరు.యూట్యూబ్ వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హారిక అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం తన పేరు మీద ఒక వెబ్సైట్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

హారిక ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను అలాగే రీల్స్ కూడా చేస్తూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె నీలిరంగు చీర ధరించి ఏకంగా ఓ కొంటె పిల్లని చూసా.. సెంటీమీటర్ నవ్వమని అడిగా.. తన నవ్వే నవ్వుకు వంద మంది చచ్చిపోయారు అనే పాటకు రీల్ చేసి ఆ వీడియోని షేర్ చేశారు.

ఇక ఈ రీల్ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఓ నెటిజన్ ఈ వీడియో పై స్పందిస్తూ నువ్వు పళ్ళు తోముకోలేదేమో అందుకే 100 మంది చచ్చిపోయారు అంటూ కామెంట్ చేశారు. ఇలా నేటిజన్ చేసిన కామెంట్ పై హారిక స్పందిస్తూ అబ్బే ఏం పేలలేదు అంటూ కామెంట్ చేశారు. అయితే హారిక చేసిన ఈ రియల్ వీడియో పై ఎంతో మందిని డిజైన్స్ స్పందిస్తూ అదే విధంగా కామెంట్లు చేయడం గమనార్హం.

Alekhya Harika: నెగిటివ్ కామెంట్స్ తో రెచ్చిపోయిన నెటిజన్స్…
ఇలా నేటిజన్స్ అందరూ కూడా ఈ రీల్ వీడియో పై నెగిటివ్ గా కామెంట్లు చేయడంతో చేసేదేమీ లేక హారిక కామెంట్ సెక్షన్ క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె బిగ్ బాస్ తర్వాత యధావిధిగా షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ వీడియోల ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.
































