Alekhya Reddy : నందమూరి తారకరత్న విషయంలో ఎవరూ ఊహించని విషాదం ఆయన కుటుంబాన్ని కమ్మేసింది. నలభై ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించి ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టారు. తారకరత్న గారు సినిమాల్లో అంతగా రానించకపోయినా మంచి వాగ్దాటి ఉండటంతో టీడీపీ లో ఈసారి ఎమ్మెల్యే కి పోటీచేయాలనీ భావించారు. అయితే ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆయన అందరికీ శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన వ్యక్తిగత జీవితంలోనూ ఇప్పుడిప్పుడే తన ప్రేమ వివాహం వల్ల దూరమైన కుటుంబం మళ్ళీ కలుసుకుంటారు అనుకునే సమయానికి ఆయనే శాశ్వతంగా దూరం అయ్యాడు.

బాబాయ్ తో అబ్బాయి ని కలిపిన అలేఖ్య…
తారకరత్న తనను ప్రేమించిన అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు ఇంట్లో ఎవరూ అంగీకరించలేదు. దీంతో గుడిలో స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. ఇక కుటుంబం వారిని దూరం పెడుతూ రావడం బాధపెడుతున్న సమయంలో ఆయన పుట్టినరోజు నాడు అలేఖ్య బాలకృష్ణ గారిని అతిధిగా ఆహ్వానించింది. అయితే ఈ విషయం తారకరత్న కు చెప్పకుండా దాచిపెట్టింది. ఒకవేళ ఆయన రాకపోతే తారకరత్న ఫీల్ అవుతాడు అని చెప్పలేదు. అయితే బాలకృష్ణ వస్తాడా రాడా అనుకుంటే ఆయన పార్టీకి వచ్చారు.

ఇక తారకరత్నను తన కుటుంబానికి దగ్గర చేయడంలో అలేఖ్య తన వంతు ప్రయత్నం చేసింది. ఇక అలా మెల్లగా ఇక కుటుంబం ఒక్కటవ్వుతుంది అనే సందర్భంలో ఇలా ఆయన మరణం అలేఖ్య గారికే కాకుండా నందమూరి కుటుంబానికి తీరని లోటు. నిజానికి తారకరత్న వివాహానికి ఆయన తండ్రి అభ్యంతరం చెప్పడానికి కారణం అలేఖ్య గారు ఆల్రడీ డివోర్స్ తీసుకున్న మహిళా కావడం. అది కూడా టీడీపీ సీనియర్ లీడర్ గా ఒకప్పుడు ఉన్న మాధవరెడ్డి గారి కొడుకు ను పెళ్లి చేసుకుని డివోర్స్ ఇవ్వడం వల్ల మోహన్ కృష్ణ ఈ పెళ్ళికి అంగీకరించలేదు. ఇక ఆల్రెడీ ఒకసారి పొలిటికల్ కుటుంబానికి ఇచ్చి కూతురుకు పెళ్లి చేసిన అలేఖ్య తండ్రి అలేఖ్య డివోర్స్ తీసుకోవడంతో మరోసారి సినిమా, పొలిటికల్ ఫ్యామిలీ లోకి కూతురును పంపించడానికి ఇష్టపడలేదు. అలేఖ్య తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోయినా వారి ప్రేమకోసం వారు నిలబడ్డారు అలేఖ్య, తారకరత్న.































