స్మార్ట్‌ఫోన్‌తో ఆర్థిక లావాదేవీలు చాలా సులుభతరం అయిపోయాయి. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా.. విత్ డ్రా చేయాలన్నా ఎక్కువ సమయం కేటాయించేవారు. అంతేకాకుండా..బ్యాంక్ కు వెళ్లాలంటే రవాణా ఖర్చులు కూడా అయ్యేయి. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పేమెంట్లు కూడా డిజిటల్ అయ్యాయి. వాటి కోసం ఎన్నో ఆర్థిక లావాదేవీల యాప్ లు వచ్చాయి.

స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత లావాదేవీలన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్ యాప్స్‌తో భారీ లావాదేవీలు సైతం నిమిషాల్లో చేసేయొచ్చు. ఇదిలా ఉండగా.. బ్యాంక్ యాప్స్ ఉన్న వాళ్ల ఫోన్లలో కొన్న యాప్ లు ఉండటం అనేది డేంజర్ గా మారుతుంది. అదేంటంటే.. బ్యాంకింగ్ లావాదేవీల్లో ఈ మోసాలను అడ్డుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉంటోంది. తాజాగా దానికి సంబంధించి కస్టమర్లను అలర్ట్ చేసింది.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు నాలుగు యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేయకూడదని హెచ్చరిస్తోంది. అందులో ముఖ్యంగా Teamviewer, Mingleview, Anydesk, Quick Support లాంటివి అస్సలు ఇన్ స్టాల్ చేసుకోవద్దని తెలిపింది. ఇవి ఉంటే.. హ్యాకర్లు మీ ఫోన్ ను సింపుల్ గా హ్యాక్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి మీరు గిఫ్ట్ గెలిచారని.. లాటరీ తగిలిందని ఎవరైనా ఫోన్ చేసినా వాటికి స్పందించొద్దని పేర్కొంది.
డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, పిన్ లాంటి వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది కూడా అడగరని చెబుతోంది బ్యాంకు. ఎవరైనా ఇలా ఫోన్ చేసి వివరాలు అడిగినట్లయితే 1800111109 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ లో కంప్లైంట్ ఇవ్వొచ్చని ఎస్బీఐ తమ ఖాతాదారులకు సూచించింది.





























