Ranbeer Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఏప్రిల్ 14వ తేదీ నటి అలియా భట్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహమైన అనంతరం వీరిద్దరు కలిసి సినిమా షూటింగులు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన బ్రహ్మాస్త్రం సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

రణబీర్ బ్రహ్మాస్త్రతో పాటు ‘షంషేరా’ ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రణబీర్ కపూర్ అలియా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అలియా తనకు రెండవ భార్య అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు తాను తన మొదటి భార్యను చూడలేదని ఆయన తన మొదటి భార్య గురించి అసలు విషయం చెప్పారు.

తాను కొన్ని సంవత్సరాల క్రితం తన పేరెంట్స్ తో కలిసికృష్ణరాజ్ బంగ్లాలో ఉండేవారట. ఈయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక అమ్మాయి పురోహితుడిని పిలుచుకొని ఏకంగా తన ఇంటి గేటు ముందు నిలబడి తన గేటుతో పెళ్లి చేసుకుందని, గేటుకు బొట్లు పెట్టి పూలమాలవేసి తను కూడా పూల మాల వేసుకుని పెళ్లి చేసుకుని వెళ్లిందని తెలిపారు.
త్వరలోనే మొదటి భార్యను కలుస్తానని ఆశిస్తున్నా…
అయితే ఆ సమయంలో తాను ఇంట్లోలేనని ఇంటికి వచ్చాక వాచ్ మెన్ ఈ విషయం చెప్పే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యానని రణబీర్ తెలిపారు.అయితే ఇప్పటివరకు ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అనే విషయం తనకు తెలియదని అయితే త్వరలోనే తనను కలుస్తానని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రణబీర్ కపూర్ తన మొదటి పెళ్లి గురించి తెలియజేశారు. ఇలా ఈయన పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



























