Aliya Bhatt: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే వారు వారి రేంజ్ కు అనుగుణంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం స్టార్ సెలబ్రిటీలు కూడా వారి స్టార్డం పక్కనపెట్టి సామాన్య ప్రజలుగా వ్యవహరిస్తుంటారు.ఈ విధంగా సెలబ్రిటీల తీరు చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.నిజంగానే ఒక స్టార్ హోదాలో ఉన్నటువంటి వారు ఇలా సామాన్య ప్రజలుగా మారిపోతే చూడటానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

ప్రస్తుతం నటి అలియా భట్ సైతం ఒక్కసారిగా తన స్టార్ స్టేటస్ పక్కన పెట్టి సామాన్య అమ్మాయిగా మారిపోయారు ఇంతకీ ఈమె ఏం చేసింది అనే విషయానికి వస్తే…అలియా భట్ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూతురు ఆలనా పాలన చూసుకుంటున్నటువంటి అలియా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు త్వరలోనే తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
అయితే తాజాగా ఈమె తన ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చారు. దీంతో ఫోటోగ్రాఫర్స్ ఆమెను చుట్టుముట్టి ఫోటోలను తీయడం మొదలుపెట్టారు. అయితే ఫోటోగ్రాఫర్ల కోసం కొన్ని ఫోజులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్స్ లో ఒకరు తన చెప్పు మిస్ చేసుకున్నారు. ఆ విషయం గుర్తించినటువంటి అలియా చెప్పు వెతికి స్వయంగా తన చేతితో ఫోటోగ్రాఫర్ కి అందించారు.

Aliya Bhatt: చెప్పు అందించిన అలియా…
ఇలా ఈమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ స్వయంగా కెమెరామెన్ చెప్పును తన చేతితో పట్టుకొని తనకు ఇవ్వడంతో ఈమె వ్యవహార శైలి పట్ల నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో కెమెరా మెన్స్ వద్దని చెబుతున్నప్పటికీ ఈమె మాత్రం వినకుండా ఆ చెప్పును ఆ వ్యక్తికి ఇచ్చారు. ఇక ఈమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
Awww #AliaBhatt is just sooo helpful 🥺💗
She picks up a chappal which is one of the paps left bymistake, isnt she just too adorable 😍@aliaa08 @viralbhayani77 pic.twitter.com/u5Blu1990K— Viral Bhayani (@viralbhayani77) July 13, 2023