Allu Aravind: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అనే బ్రాండ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య హాస్యనటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు అయితే అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టారు అల్లు అరవింద్.గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈయన నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అల్లు అనే పేరుకి మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు.

ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అల్లు అరవింద్ ఈ విషయంపై మాట్లాడుతూ ఎంతో గర్వపడ్డారు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన ఇంటిపేరు చెప్పడానికి ఎంతో బాధపడతారు అయితే నిజజీవితంలో మాత్రం తన ఇంటి పేరును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని అల్లు అరవింద్ సంతోషం వ్యక్తం చేశారు.ఇంటిపేరు ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఆ ఇంటి పేరును బ్రాండ్ గా మార్చడం కొంతమందికే సాధ్యమవుతుందని ఈయన తెలిపారు.
ఇలా అల్లు అనే పేరుకి తన తండ్రిగారు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయగా ఆ ఇమేజ్ ను మరి కాస్త ఉన్నత శిఖరాలకు నిర్మాతగా తాను తీసుకోవచ్చానని తెలిపారు. అయితే ఆయన మనవడిగా నా కుమారుడిగా అల్లు అర్జున్ అల్లు అనే బ్రాండ్ ను జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని ఈ సందర్భంగా అల్లు అర్జున్ సంపాదించుకున్న క్రేజ్ ఆయన సాధించిన విజయంపై అల్లు అరవింద్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Allu Aravind: నాన్నకు అల్లు పేరు అంటే చాలా ఇష్టం..
ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ను ప్రశ్నిస్తూ ఇప్పుడు కనుక మీ నాన్నగారు కనిపిస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా అల్లు అరవింద్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నాన్నగారికి అల్లు అనే పేరు అంటే చాలా ఇష్టం. ఆ పేరును నేను ప్రయత్నించి చాలా దూరం తీసుకెళ్లాను. ఇప్పుడు నీ మనవళ్ళు ఆ పేరును ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారని చెబుతాను అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































