Allu Arjun: ఆ హీరోయిన్ ను ట్విట్టర్ లో బ్లాక్ చేసిన అల్లు అర్జున్… స్క్రీన్ షాట్లతో ఆరోపణ చేసిన నటి?

0
128

Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు.ఇలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈయన తనకు సంబంధించిన తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంతో ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇకపోతే అల్లుఅర్జున్ తాజాగా తనని ట్విటర్లో బ్లాక్ చేశారంటూ నటి ఆరోపణలు చేశారు.

ఇలా అల్లు అర్జున్ ట్విట్టర్లో బ్లాక్ చేసిన ఆనటి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో నటి భాను శ్రీ మెహ్రా హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది. ఇక హీరోయిన్ గా భాను శ్రీ కూడా ప్రేక్షకులను మెప్పించ లేకపోవడంతో ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.

Allu Arjun: అన్ బ్లాక్ చేసిన బన్నీ..

ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భాను శ్రీ మెహ్రా తాజాగా అల్లు అర్జున్ తనని ట్విట్టర్లో బ్లాక్ చేశారంటూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా ఈ స్క్రీన్ షాట్లను షేర్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే ఈమె మరొక పోస్ట్ చేస్తూ…గ్రేట్ న్యూస్ బన్నీ తనని అన్ బ్లాక్ చేశారని మరొక పోస్ట్ చేశారు. ఇలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ తనని ఎందుకు బ్లాక్ చేశారు తిరిగి ఎందుకు అన్ బ్లాక్ చేశారు అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.