Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులలో భాగంగా ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లారు. మార్గమధ్యమంలో అనంతపురం గార్లదిన్నె మండలం కణంపల్లి వద్ద ఆగారన్న విషయం తెలుసుకున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ అధినేత అల్లు అర్జున్ కు తన ఫామ్ హౌస్ కి రావాల్సిందిగా స్వాగతం పలికారు. దీంతో అల్లు అర్జున్ తెలుగుదేశం పార్టీ నేత గెస్ట్ హౌస్ కి వెళ్ళారు.
శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి అల్లు అర్జున్ ని తన ఫామ్ హౌస్ లోకి తీసుకుని వెళ్లారు. ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి కూడా బన్నీకి వెల్ కమ్ చెప్పారు. ఇలా అల్లు అర్జున్ కు తమ ఫామ్ హౌస్ కి వెల్కమ్ చెప్పడమే కాకుండా అక్కడ రాయలసీమ వంటకాల రుచులను కూడా అల్లు అర్జున్ కి పరిచయం చేశారు. అనంతరం కేశవరెడ్డి ఆయన కుమారుడు రాహుల్ రెడ్డితో కలిసి బన్నీ ఫోటోలు దిగారు.

Allu Arjun:
ఈ విధంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారన్న విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో అల్లు అర్జున్ లో చాలా విభిన్నంగా ఉంది బహుశా ఈ లుక్ లో ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.































