తాజాగా పుష్పక విమానం ట్రైలర్ విడుదల వేడుకలు జరిగాయి. ఇందుకు ముఖ్య అతిథిగా అల్లుఅర్జున్ హాజరయ్యారు. అతనితో పాటు ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వారు కన్నడ పవర్ స్టార్ పునీత్ కు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పునీత్ గురించి మాట్లాడుతూ.. పునీత్ తనకు ఎప్పటినుంచో పని చేయమని, అతను వాళ్ళ ఇంటికి వచ్చేవాడని తెలిపారు.

అంతే కాకుండా ఇద్దరు కలిసి భోజనం చేసే వాళ్ళం , నేను బెంగళూరుకు వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం, అంతే కాకుండా ఎన్నో వేడుకలకు కలిసాము, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం అని తెలిపాడు అల్లు అర్జున్. అలాగే ఒక డ్యాన్స్ కార్యక్రమానికి ఇద్దరు కలిసి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించామని తెలిపారు. ఎప్పుడు కలిసినా కూడా బెంగళూరుకి రమ్మనే వారు. అలాంటిది ఒక్కసారిగా పునీత్ లేరనే వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను అని చెప్పుకొచ్చాడు.
పునీత్ ఇలాంటి వ్యక్తి ఉండటం సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకే గర్వకారణం అని అల్లు అర్జున్ తెలిపారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అతని మరణం చాలా బాధాకరం, కొన్నాళ్ళ క్రితం సునీత తన ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళి తనతో రెండు మూడు గంటలు మాట్లాడాను అని తెలిపాడు విజయ్ దేవరకొండ. అలాంటిది అతను ఇలా ఉన్నపళంగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడం కలచివేసిందని తెలిపాడు.
మరొకవైపు పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారిగా చూసేందుకు భారీగా అభిమానులు సెలబ్రిటీలు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అక్కడికి చేరుకొని అతనికి సంతాపం వ్యక్తం చేశారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, రానా ఇంకా పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. నేడు పునీత్ అంత్యక్రియలు జరగనున్నాయి.



























