Allu Arjun: సాధారణంగా సినిమా హీరోలు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున వ్యాపార రంగంలో స్థిరపడి వ్యాపారాల ద్వారా కూడా మంచిగా సంపాదిస్తూ ఉన్నారు. ఇక ఇండస్ట్రీకి చెందిన హీరోలు చేసే వ్యాపారాల విషయానికి వస్తే హీరోలుగా సక్సెస్ అయినటువంటి వారు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తూ ఉండగా మరి కొందరు మాత్రం థియేటర్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ఈ క్రమంలోనే పలువురు హీరోలు థియేటర్లను నిర్మిస్తూ ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలోనే ఏషియన్స్ వారు ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏషియన్స్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాదులో ఇది నెంబర్ వన్ మల్టీప్లెక్స్ థియేటర్ గా పేరు సంపాదించుకుంది ఇలా ఏషియన్స్ వారు ఇదివరకే మహేష్ బాబుతో కలిసి థియేటర్ నిర్మించగా తాజాగా వీరు అల్లు అర్జున్ తో కలిసి మరో మల్టీప్లెక్స్ నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే ఏసియస్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ కోసం ఇప్పటికే పనులు ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాద్ అమీర్ పేట్ సత్యం థియేటర్లో ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మల్టీప్లెక్స్ గురించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

Allu Arjun: ఆ ఘనత సాధించిన మొదటి హీరోగా బన్నీ..
మరికొన్ని నెలలలో ప్రారంభం కానున్నటువంటి ఈ మల్టీప్లెక్స్ లో విభిన్నమైన ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్ లో అల్లు అర్జున్ వర్చువల్ ఇమేజ్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ ఇమేజ్ ముందు మనం ఎలా అయితే నిలబడి రియాక్షన్స్ ఇస్తామో అదేవిధంగా అల్లు అర్జున్ ఇమేజ్ నుంచి కూడా అలాంటి రియాక్షన్ వస్తుందని తెలుస్తోంది.ఇలా అల్లు అర్జున్ ఇమేజ్ కనుక ఏర్పాటు చేస్తే అలాంటి మొదటి ఘనత అందుకున్నటువంటి హీరోగా అల్లు అర్జున్ ఉంటారని చెప్పాలి.


































