Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. ఇక ఇప్పటికే అభిమానులు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఇక థియేటర్లను ఎంతో అందంగా ముస్తాబు కూడా చేశారు. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో పూర్తి కాగానే అభిమానులు సంబరాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

ఇదిలా ఉండగా పుష్ప సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించి మరిన్ని వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మనం సంపాదించే సంపాదన బట్టి ప్రభుత్వానికి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో సెలబ్రిటీలు భారీ స్థాయిలోనే టాక్సులు చెల్లిస్తూ ఉంటారని మనకు తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ ఏడాదికి చెల్లించే టాక్స్ కి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సినీ ప్రముఖుల జాబితాను ప్రకటించింది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా టాక్స్ చెల్లించే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మాత్రమే ఉండటం గమనార్హం. తాజాగా ఈ జాబితాలో టాప్ 20 సెలెబ్రిటీలను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ 16 వ స్థానంలో ఉండటం విశేషం.

Allu Arjun: 16వ స్థానం..
2023- 24 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ ఏకంగా రూ.14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా నివేదిక తెలిపింది. దీంతో ఈయన భారీ స్థాయిలోనే టాక్స్ పే చేస్తున్నారని చెప్పాలి. ఇక మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ టాప్ 20 జాబితాలో అల్లు అర్జున్ పేరు మినహా రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి వారి పేర్లు లేకపోవటం గమనార్హం.



























