Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన చిత్రం వరుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి భాను శ్రీ మెహ్రా.ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా రాలేదు.ఇలా అవకాశాలు రాకపోవడంతో ఈమె కేవలం సోషల్ మీడియాని నమ్ముకుని వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే కొద్ది రోజుల క్రితం భాను శ్రీ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశారు అంటూ ఒక పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఇలా ఈమె పోస్ట్ చేసిన కొంత సమయానికి అల్లు అర్జున్ తనని అన్ బ్లాక్ చేశారు అంటూ మరొక పోస్ట్ చేశారు. ఇలా ఈ పోస్టు ద్వారా ఒక్కసారిగా భాను శ్రీ మెహ్రా వార్తల్లో నిలిచారు. అయితే ఈ హీరోయిన్ ఇప్పటికి బన్నీని వదలడం లేదని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ నాని నటించిన దసరా సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ట్వీట్ కి ఈమె రిప్లై ఇస్తూ తన వీడియోని చూడమంటూ తనకు ట్యాగ్ చేసింది. ఇది చూసినటువంటి బన్నీ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాను శ్రీని భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Allu Arjun: నీకు బ్రెయిన్ ఉందా…
నీకేం పని పాట లేదా.. అసలు నీకు బ్రెయిన్ ఉందా…నీకు పని లేకపోతే మా హీరోకి మాత్రం చాలా పని ఉంది ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు. నువ్విలా వీడియోలు చూడమంటూ తరచూ తనని ట్యాగ్ చేస్తూ ఉండగా తనకు నోటిఫికేషన్ వస్తుంటాయి. అవి భరించలేక నిన్ను బ్లాక్ చేసి ఉంటారు. ఇలా వీడియోలు చూడమని రిక్వెస్ట్ పెట్టడం ఏంటి..ఆయన పనులన్నీ మానుకొని నీ వీడియోలు చూస్తూ కూర్చోవాలా అంటూ తీవ్రస్థాయిలో భాను శ్రీ మెహ్రా పై బన్నీ అభిమానులు మండిపడుతూ తనని ట్రోల్ చేస్తున్నారు.
Big Congratulations to the entire team of #Dasara . Brilliantly made film . Finest performance my brother @NameisNani . Candid performances by @KeerthyOfficial and all the other cast . Wonderful songs & B.Score by @Music_Santhosh garu & excellent camera work by Sathyan garu . The…
— Allu Arjun (@alluarjun) April 17, 2023






























