Allu Arjun: సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఏకంగా 70000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా విజయం సాధించడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అలాగే అభిమానులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మెగా కుటుంబ సభ్యులందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ విజయం పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు.మీరు పడ్డ కష్టం, డెడికేషన్, ప్రజలకు సేవ చేయాలనే తపన హృదయాని హత్తుకునేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేసే క్రమంలో మీరు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
వైసీపీకి మద్దతు..
ఈ విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలుపు పై చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు వైసీపీకి మద్దతు తెలిపి ఇప్పుడు జనసేనకు శుభాకాంక్షలు చెప్పడమేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైసిపి నుంచి తన స్నేహితుడు శిల్పా రవి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈయన ఆయనకు మద్దతు తెలుపుతూ నంద్యాలలో పర్యటించారు దీంతో అప్పట్లో కూడా అల్లు అర్జున్ పై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.





























