Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలోకి అల్లు వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా అల్లు అర్జున్ హీరోగా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయనకు ఏమాత్రం విరామ సమయం దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి తన సమయాన్ని కేటాయిస్తూ వారితో సంతోషంగా గడుపుతూ ఉంటారు.ఇలా తరచూ తన పిల్లలతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తన కొడుకుతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ తనకు స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కుమారుడికి విషెస్ తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే లవ్ ఆఫ్ మై లైఫ్… మై స్వీటేస్ట్ చిన్న బాబు అంటూ తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Allu Arjun: స్వీటెస్ట్ చిన్నబాబు…
ఇలా అల్లుఅర్జున్ నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో అల్లు అర్జున్ తనకు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసినటువంటి ఎంతోమంది అభిమానులు అల్లు అయాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తన దృష్టిని చదువుపై పెట్టినట్లు తెలుస్తోంది.ఇక అర్హ మాత్రం ఇప్పటికే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె సమంత నటించిన శాకుంతలం సినిమాలో భరతుడి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
































