స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాదు కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రోడ్డు పక్కన తన కారును ఆపి మరీ ఓ హోటల్ లో టిఫిన్ చేశారు. ప్రస్తుతం అతడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొదట ఆర్య సినిమాతో హీరోగా మారిన అల్లు అర్జున్.. ఆ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. ఆ బిరుదు ఇచ్చింది దర్శకుడు సుకుమార్.

అయితే ఆ స్టార్ అల్లుకి సరిపోదని.. తాజాగా పుష్ప సినిమాకు కూడ దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ దానిని మార్చేసి ఐకాన్ స్టార్ గా మార్చాడు. ఇదిలా ఉండగా.. అతడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. దానిలో భాగంగానే సినిమా షూటింగ్ ను ప్రస్తుతం రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో చిత్రీకరణ జరుపుకుంటుంది.
మరో పది రోజుల పాటు కాకినాడ, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు పుష్ప టీం. దాని తర్వాత చిత్రీకరణ అంతా పూర్తి అయిపోతుందట. ఇదిలా ఉండగా.. అక్కడ వర్షం విపరీతంగా పడుతుండటంతో సుకుమార్ షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు. దీంతో బన్నీ అక్కడ ప్రాంతాలను అన్నీ చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే కాకినాడలోని థియేటర్‌లో ‘సీటీమార్’ చిత్రాన్ని అల్లు అర్జున్ వీక్షించారు.
Icon Star #AlluArjun was having breakfast at road side tiffin centre near gokavaram.@alluarjun ❤️ #Pushpa pic.twitter.com/25OCuNGRB4
— Allu Arjun Fan™ (@IamVenkateshRam) September 13, 2021
అలానే గోకవరంలో రోడ్డు పక్కన హోటల్‌లో బన్నీ టిఫిన్ చేయగా, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇదిలా ఉండగా బన్నీ టిఫిన్ కు సంబంధించి డబ్బులు పే చేస్తుండగా.. హోటల్ వాళ్లు వద్దన్నారు. అయినా బిల్ పే చేసి బయటకు వచ్చాడు బన్నీ. విషయం తెలుసుకున్న జనం బన్నీని చూడటానికి గుంపులుగుంపులుగా చేరుకున్నారు.

































