Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ బేబీ సినిమా అప్రిషియేట్ ఈవెంట్లో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నీర్మాతగా ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ.

ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదల అయ్యే ఇప్పటివరకు ఏకంగా 45 కోట్ల కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ అప్రిషియేట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
గత కొంతకాలంగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి ఏమాత్రం పడలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే కొన్ని సందర్భాలలో ఈ కుటుంబాలలో జరిగిన ఫంక్షన్లకు హీరోలు హాజరు కాకపోవడంతో ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదంటూ ఎప్పటికప్పుడు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. అదేవిధంగా తాజాగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ విని మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

Allu Arjun: చివరి శ్వాస వరకు ఆయన అభిమానినే…
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ తాను తన కట్టే కాలే వరకు కూడా చిరంజీవికి అభిమానిగానే ఉంటానని ఇందులో ఏ మాత్రం మార్పు ఉండదు అంటూ అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా చిరంజీవి గురించి అల్లు అర్జున్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా మెగా అల్లు కుటుంబం మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవని మరోసారి క్లారిటీ వచ్చింది.