Allu Arjun: అల్లు అర్జున్ జాతకం అలా ఉందా… బన్నీ కెరియర్ గురించి వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

0
36

Allu Arjun: అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈయన పుష్ప సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయనకు అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది..

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పుష్ప2సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటించబోతున్నారు.

ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ జాతకం గురించి వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ జాతకం గురించి వేణు స్వామి మాట్లాడుతూ అల్లు అర్జున్ జాతకం అద్భుతంగా ఉందని తెలియజేశారు. మరో 10 సంవత్సరాల పాటు ఈయన కెరియర్ కు ఎలాంటి ఢోకా లేదని తెలిపారు.

Allu Arjun: బన్నీ జాతకం అద్భుతం…

10 సంవత్సరాల పాటు అల్లు అర్జున్ సినిమా రంగంలో దూసుకుపోతారని ఈయన హిట్ సినిమాలతో అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ హీరో ఈయనే అని నిరూపించుకుంటారు అంటూ వేణు స్వామి తెలిపారు.ఇక ఈ పది సంవత్సరాల కాలంలో అల్లు అర్జున్ పై నిర్మాతలు పది రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వెనకేసుకుంటారని వేణు స్వామి చెప్పినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.