Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. పుష్ప పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పాటలో అల్లు అర్జున్ చేతిలో గాజు గ్లాస్ లో టీ తాగుతూ కనిపిస్తారు.
ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నీ ఇలా గాజు గ్లాస్ చేతిలో పట్టుకొని పరోక్షంగా జనసేనని సపోర్ట్ చేస్తున్నారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
జనసేనకు మద్దతు..
ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో వెళ్లి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం ఇలా చేతిలో గాజు గ్లాసు పట్టుకుని జనసేనని సపోర్ట్ చేస్తున్నారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.



























