Pushpa 2: అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అందరూ భావించారు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీ విడుదల కావాల్సింది కాస్త వాయిదా పడి డిసెంబర్ 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. గత కొద్దిరోజులుగా పుష్ప 2 వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి కానీ మేకర్స్ ఈ సినిమా వాయిదా గురించి క్లారిటీ ఇచ్చారు.

ఆగస్టు 15వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 6 తేదీ రాబోతుందని మేకర్స్ తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. ఇక ఈ పోస్టుపై ఒక అభిమాని స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుష్ప 2 విడుదల వాయిదా గురించి స్పందిస్తూ చాలా జోక్ గా ఉందా తమాషా చేస్తున్నారు. పుష్ప సినిమా 2024 జూలైలోనే విడుదల కాబోతుందని తెలిపారు. తిరిగి ఆగస్టుకి మార్చారు. ఇప్పుడు డిసెంబర్ 6 తేదీ విడుదల కాబోతుందని తెలుపుతున్నారు. ఫ్యాన్స్ ఎమోషన్ తో ఆడుకుంటున్నారా పుష్ప టీం మొత్తం పై కోర్టుకు వెళ్తాను అంటూ అభిమాని తన ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
అదనపు భారం..
నిజానికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పనుల నిమిత్తం వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే ఇంకా కొన్ని సన్నివేశాలను షూటింగ్ చేయాల్సి ఉండగా మరికొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేసారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా వాయిదా వేయడంతో నిర్మాతలకు సుమారు 40 కోట్ల వరకు అదనపు బారం పడుతుందని సమాచారం.



























