అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలు ఉన్న ఐటమ్ సాంగ్ లో మొట్టమొదటిసారి సమంత నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఈ ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడింది.

ఇక ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాటపై పురుష సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఈ పాటలు “మీ మగ బుద్ధి వంకర బుద్ధి” అనే లిరిక్ మగవాళ్ళను అవమానపరిచే విధంగా ఉంది అంటూ పలువురు ఈ లిరిక్ పై కేసు నమోదు చేస్తామని, కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.
ఇక ఈ పాటను సినిమాలో బ్యాన్ చేయాలని లేకపోతే సమంత, రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ పై కేసు వేస్తామని తెలిపారు. ఇక ఈపాట పై ఎన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఇంతవరకు చిత్రబృందం స్పందించలేదు. తాజాగా ఈ పాట పై అల్లు అర్జున్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
“ஊ சொல்றியா மாமே!” பாடலில் வருவது உண்மை தானே…! அல்லு அர்ஜூன் பதில்..#AlluArjun #Pushpa pic.twitter.com/1TLqtscOe7
— Shruti TV (@shrutitv) December 14, 2021
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రిపోర్టర్ ఈ సినిమా ఐటమ్ సాంగ్ లోని మీ మగ బుద్ధి వంకర బుద్ధి అనే లిరిక్ పై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా వెంటనే అల్లు అర్జున్ మాట్లాడుతూ లిరిక్ లో తప్పు లేదు..అది నిజమే కదా అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































