Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుత పుష్ప సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి ఈ సినిమాకు సీక్వెల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పుష్ప 2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ వీడియోలో అల్లు అర్జున్ ఏకంగా అమ్మవారి గెటప్ లో అందరిని భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నారు సాక్షాత్తు ఆ అమ్మవారి నడిచొచ్చినట్టుగా ఈయన కనిపించడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో నడిచి వచ్చే సన్నివేశాన్ని తీయడం కోసం ఏకంగా 51 టేకులు తీసుకున్నారని తెలుస్తుంది.
అమ్మ వారి గెటప్..
అమ్మవారి గెటప్ లో అంటే నిజంగానే అమ్మవారు నడిచొచ్చే విధంగా హావభావాలన్నింటినీ పలికిస్తూ ఉండాలన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ ఇన్ని టేక్స్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో నటి రష్మిక మందన్న నటించిన సంగతి మనకు తెలిసిందే.

































