Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా బుకింగ్స్ మొదలైన విషయం తెలిసిందే.

ఒక ఏపీలో మినహా అన్ని ప్రాంతాలలో కూడా బుకింగ్స్ మొదలయ్యాయి అయితే ఏపీలో టికెట్ల రేట్లు పెంచే విషయం గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు కానీ ఇటీవల ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుతూ జీవో విడుదల చేస్తున్న దీంతో ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.
ఇలా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలకు కూడా అనుమతి లభించడంతో నటుడు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి తెలిపిన ఏపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Allu Arjun: ధన్యవాదాలు..
ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుంది. సినిమా ఇండస్ట్రీ మేలుకోసం ఈ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే చిత్ర పరిశ్రమను బలోపేతం చేయటంలో ఆయన అమూల్యమైన మద్దతు తెలిపిన గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.































