Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా హీరోగా మారాడు. ఆ సినిమా మంచి హిట్ అవడమే కాకుండా ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన బన్నీ, దేశముదురు , ఆర్య వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎన్నో విమర్శలు వినిపించాయి. దీంతో అల్లు అర్జున్ క్రమంగా తన రూపురేఖలు మార్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందాడు.

ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.ఈ సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు, డైలాగులకి టాలివుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా క్రేజ్ మాత్రం అలాగే ఉంది. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. పుష్ప 2 కోసం ఇటు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల అల్లు అర్జున్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా అల్లు అర్జున్ దర్శక నిర్మాతలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. ముఖ్యంగా తన సినిమాలకు పని చేసిన దర్శకులతో అల్లు అర్జున్ కి ఉంటుంది. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ దర్శకులతో కూడా మంచి అనుబంధం ఉంటుంది. ఇలా అందరి దర్శకులతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న అల్లు అర్జున్ ఒక సీనియర్ దర్శకుడికి మాత్రం ఇప్పటికీ భయపడుతూనే ఉంటాడు.

Allu Arjun: అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బన్నీ…
ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్వీ కృష్ణారెడ్డి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన ఎస్వీ కృష్ణారెడ్డి అంటే అల్లు అర్జున్ కి ఇప్పటికి చాలా భయం. ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమా షూటింగ్ సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి వద్ద అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలో సెట్ లో ఉన్న అందరిని కృష్ణారెడ్డి ఎంతో క్రమశిక్షణగా ఉంచేవారు. అల్లు అర్జున్ తో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అలా అప్పటినుండి ఇప్పటికీ కూడా ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఇంట్లో మాట్లాడాలంటే అల్లు అర్జున్ కొంచెం భయపడుతూనే ఉంటాడు.


































