Allu Arjun: హీరోలు అవ్వాలంటే డాన్స్ అవసరం ఏ మాత్రం లేదు… అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

0
42

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బేబీ సినిమా అప్రిషియేషన్ ఈవెంట్లో పాల్గొన్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. జులై 14వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఇప్పటివరకు 45 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

ఇలా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా పట్ల ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ అప్రిషియేషన్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ తనకు డాన్స్ రాదని కానీ అల్లు అర్జున్ చూసి నేర్చుకుంటున్నానని తెలిపారు..

ఆనంద్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. హీరోలు కావాలి అంటే డాన్స్ అవసరం లేదని తెలిపారు.నాకు డాన్స్ వచ్చు కనుక నాలో ఉన్న టాలెంట్ బయట పెడుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెట్టి వారిని వారు నిరూపించుకోవాలని తెలిపారు.

Allu Arjun:

ఇక హీరోలు అవ్వాలి అంటే ఫైట్స్ డాన్స్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈయన ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా గురించి కూడా అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఆగిరిపోయే అప్డేట్ ఇచ్చి అభిమానులను సంతోష పరిచారు.