Pushpa 2: ప్రస్తుతం టాలీవుడ్ డ్రెస్ లో మెగా వర్సెస్ అల్లు అనే వివాదం కొనసాగుతుంది. మెగా కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించగా పవన్ కళ్యాణ్ మాత్రం తన స్నేహితుడు వైసీపీ నేతకు మద్దతుగా నిలవడంతో మెగా వర్సెస్ అల్లు అనే విధంగా వివాదం కొనసాగుతుంది.

ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియకపోయినా ఆయన భారీ మెజారిటీతో గెలిచి నేడు ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమాలకు భారీ దెబ్బ పడుతుందంటూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ గీతాకృష్ణ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ సినిమాలలో తోపు కాని రాజకీయాలలో ఒక బచ్చా అని తెలిపారు.. ప్లాన్డ్ గా సినిమాలు చేసి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక అనుకోకుండా ఈయనకు నేషనల్ అవార్డు రావడంతో ఈయన క్రేజ్ ఎక్కడికో పెరిగిపోయింది.
ఇక మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య వివాదం నడుస్తుంది. ముఖ్యంగా అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ అంటే చిన్నచూపు ఈయన వివిధ విధానాలు పవన్ కళ్యాణ్ కు నచ్చకపోవడంతో మొదటి నుంచి కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక గేమ్ ఛేంజర్ అవుతారని అల్లు అరవింద్ ఊహించలేదు.
గేమ్ ఛేంజర్…
ఇలా పవన్ కళ్యాణ్ కు కాకుండా ఒక పబ్ లో పరిచయం అయిన శిల్పా రవి కోసం అల్లు అర్జున్ వెళ్లడం తప్పేనని ఆ ప్రభావం తన తదుపరి సినిమా పై పడుతుందని ఇప్పటికైనా అల్లు అర్జున్ మెగా కుటుంబంతో సంధి చేసుకుంటే మంచిది అంటూ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























