శుక్రవారం సాయంత్రం మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే అతనిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలిసిన వెంటనే మెగా హీరోలు అందరూ ఆసుపత్రికి తరలివచ్చి సాయిధరమ్ తేజ్ ను పరామర్శించారు. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై ఎంతోమంది అభిమానులు, సెలబ్రిటీలు స్పందిస్తూ అతను తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై అల్లు అర్జున్ స్పందించలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం అందరికన్నా ముందుగా అల్లు అర్జున్ కి తెలిసిందని, ఆయనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేశారని, సాయి తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో అతను హైదరాబాద్ చేరుకోలేదని తెలిపారు. పుష్ప షూటింగ్ లో ఉన్న తనకు హైదరాబాద్ రావడం కుదరలేదని తెలిపారు. ఈ క్రమంలోనే నిత్యం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ విరామం దొరకడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే అపోలోకి వెళ్లి సాయిధరమ్ తేజ్ ను పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియజేశారు. త్వరలోనే సాయి తేజ్ కోలుకొని డిశ్చార్జి అవుతారని తెలియజేశారు.ప్రస్తుతం అపోలోకి చేరుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































